కార్తికమాస పర్వదిన సందర్భంగా గోదావరి తీరంలో ఆద్యాత్మిక శోభ సంతరించకుంది. రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్, కోటిలింగాల, సరస్వతి ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలాచరించారు. తూర్పుగోదావరి జిల్లాలో దక్షిణ కాశిగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగుతోంది. మంత్రి వేణుగోపాల కృష్ణ స్వామి అమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ని జిల్లాలోని అన్ని ఆలయాల్లోనూ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కొవిడ్ కారణంగా స్వల్ప సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తున్నారు. సప్త గోదావరిలోనూ స్నానాలు నిలిపివేశారు.
కార్తిక మాసం సందర్భంగా శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు - ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం విశిష్టత
కార్తిక మాసం తొలిసోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. కొవిడ్ కారణంగా ఆలయాల్లో అధికారులు కట్టుదిట్టమై ఏర్పాట్లు చేశారు. సామూహిక స్నానాలకూ, పూజలకు అనుమతివ్వటం లేదు.
Draksharamam temple