ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నీటి కోసం శునకం అవస్థలు... డబ్బాలో ఇరుక్కున్న తల - dog problem for water at rajamahendra varam

రాజమహేంద్రవరం టీ.నగర్​లో ఓ కుక్క నీటి కోసం తిప్పలు పడింది. మంచినీళ్ల కోసం ప్లాస్టిక్​ డబ్బాలో తలదూరిస్తే... లోపల తల ఇరుక్కుపోయి నానా తంటాలు పడింది.

dog problem for water at rajamahendra varam
నీటి కోసం శునకం అవస్థలు... డబ్బాలో ఇరుక్కున్న తల

By

Published : Apr 17, 2020, 9:38 AM IST

నీటి కోసం శునకం అవస్థలు... డబ్బాలో ఇరుక్కున్న తల

లాక్‌డౌన్‌తో మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ అన్నపానీయాలు దొరకట్లేదు. లాక్‌డౌన్‌ ఆరంభం నుంచీ రోడ్లపై ఆహారం దొరక్క అలమటిస్తున్న మూగజీవాలు... వేసవి దెబ్బకు అల్లాడిపోతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం... గుప్పెడు మెతుకుల కోసం అష్టకష్టాలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టి.నగర్‌ పరిసరాల్లో.. ఓ కుక్క మంచినీళ్ల కోసం ప్లాస్టిక్‌ డబ్బాలో తలదూర్చింది. మెడ లోపల ఇరుక్కుపోవటంతో ముప్పతిప్పలు పడింది. దీని అవస్థను గమనించిన పారిశుద్ధ్య కార్మికులు డబ్బాను తొలగించటంతో... బతుకు జీవుడా అంటూ పరుగులు తీసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details