పాము కాటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన బాలుడికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు. కోరుకొండ గ్రామానికి చెందిన బొక్కా సిద్ధు పదో తరగతి చదువుతున్నాడు. 4న ఇంటి వద్ద పాము కాటుకు గురై అపస్మారక స్థితికి చేరుకోవడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించగా శనివారం స్పృహలోకి వచ్చాడు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయానికి.. విషప్రభావంతో కొంతసేపు హృదయ స్పందన నిలిచిపోయిందని, సకాలంలో వైద్యం అందించడంతో బతికినట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసులు లక్షలో ఒకటి ఉంటుందని ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డా.చంద్రశేఖర్ తెలిపారు.
ఆగిన గుండెకు ఆయువిచ్చారు! - rajmahendravaram news
పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితికి చేరిన బాలుడికి సకాలంలో వైద్యం అందించి బతికించారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు.
ఆగిన గుండెకు ఆయువిచ్చారు!