ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా సరుకులు అందుకునేందుకు ఆరాటం చూపిస్తున్న ప్రజలు.. సామాజిక దూరం నిబంధనను గాలికి వదిలేస్తున్నారు. వారం నుంచి ఇళ్లకే పరిమితమైన జనం.. బియ్యం, కందిపప్పు కోసం ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే రేషన్ డిపోల వద్ద బారులు తీరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తుని, అనంతపురం జిల్లా మడకశిర, ప్రకాశం జిల్లా చీరాలలోని రేషన్ డిపోలు రద్దీగా మారాయి. అధికారులు, వాలంటీర్లు సైతం జనాన్ని అదుపు చేయలేకపోతున్నారు.
ఒక రోజు ఆలస్యమైతే సరకులు అయిపోతాయేమో, మళ్లీ వస్తాయో రావో అనే భయంతో.. జనం ఇలా ఎగబడుతున్నారు. నిత్యావసర వస్తువుల విషయంలో సామాజిక దూరాన్ని.. దూరం పెడుతున్నారు. రేషన్ దుకాణాల వద్ద పోలీసులు లేని కారణంగా లాక్డౌన్ అమలు కావటం లేదు. మరి కొందరు తెచ్చిన సంచులను వంతులవారీగా వరుసలో పెట్టి పక్కన నిల్చుంటున్నారు. డిపోలకు జనం పోటెత్తుతున్న కారణంగా.. సర్వర్లు మొరాయిస్తున్నాయి.
కరువైన ధరల పట్టిక..