ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు: డీజీపీ - boat Accident in ap

బోటు ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. బోటును వెలికితీసేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని వివరించారు. కచ్చులూరు నుంచి ధవళేశ్వరం వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు.

డీజీపీ సవాంగ్

By

Published : Sep 17, 2019, 7:48 PM IST

Updated : Sep 17, 2019, 8:06 PM IST

డీజీపీ గౌతమ్ సవాంగ్

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రులు, డీజీపీ సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, మంత్రి విశ్వరూప్, డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధితులను పరామర్శించారు. బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని మృతదేహాలు లభ్యమయ్యే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

బోటును వెలికితీసేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామన్న డీజీపీ... ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కచ్చులూరు నుంచి ధవళేశ్వరం వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. సురక్షితంగా బయటపడిన వారి నుంచి వివరాలు తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. బోటు ప్రమాదంపై వారంలోగా మంత్రివర్గ కమిటీకి నివేదిక అందిస్తామని చెప్పారు.

ఇదీ చదవండీ... వరదలో చిక్కుకున్న ఇద్దరు గొర్రెల కాపర్లు..రక్షించేందుకు యత్నం

Last Updated : Sep 17, 2019, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details