Minister Viswaroop procession: కోనసీమ జిల్లా అమలాపురం శాసనసభ్యుడు పినిపే విశ్వరూప్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం నిన్న రాత్రి అమలాపురం ఊరేగింపుగా చేరుకున్నారు. మంత్రిగారి ఊరేగింపులో వైకాపా నాయకుడు, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు మంత్రి విశ్వరూప్‌కు పూలమాలలు వేసి నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు విరజిమ్మిన సంఘటన విమర్శలకు దారి తీసింది. అనంతరం ఆ నోట్లను అక్కడే ఉన్న కార్యకర్తలు పోటీపడి మరీ ఏరుకున్నారు.
మంత్రా మజాకా..! డబ్బులతో స్వాగతం.. మెప్పుకోసం నోట్లు చల్లిన నేత.. - Minister Viswaroop procession in Amalapuram
తమ నేతకు మంత్రి పదవి దక్కిందని కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి ఊరేగింపులో సందడి చేశారు. అంతటితో ఆగకుండా.. నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు ఇష్టమొచ్చినట్లు విరజిమ్మారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో లేని కొత్త సంప్రదాయానికి తెరతీశారు. అయితే వైకాపా నేతల తీరును పలువురు తప్పుపడుతున్నారు. సంబరాలకు ఓ పరిమితి ఉంటుందని అంటున్నారు.
![మంత్రా మజాకా..! డబ్బులతో స్వాగతం.. మెప్పుకోసం నోట్లు చల్లిన నేత.. Minister Viswaroop procession](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15013649-468-15013649-1649905799391.jpg)
Minister Viswaroop procession
మంత్రి ఊరేగింపులో విరజిమ్మిన కరెన్సీ నోట్లు..పోటీపడి ఏరుకున్న కార్యకర్తలు..
Last Updated : Apr 14, 2022, 12:40 PM IST