తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. విజయవాడ నుంచి గత మంగళవారం తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీకి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. విషయం తెలుసుకున్న కేంద్ర కారాగారం అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పాజిటివ్ వచ్చిన రిమాండ్ ఖైదీని కొవిడ్ 19 ఆసుపత్రికి తరలించారు. ఇవాళ 25 మంది ఖైదీలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మొత్తం 200 మంది వరకూ ఖైదీలు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరోనా కలకలం - central jail prisoner corona positive news
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని ఓ రిమాండ్ ఖైదీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన అధికారులు రిమాండ్ ఖైదీని కోవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
![రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరోనా కలకలం సెంట్రల్ జైలులో కరోనా కలకలం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7672817-186-7672817-1592498788168.jpg)
సెంట్రల్ జైలులో కరోనా కలకలం
కారాగారానికి తీసుకొస్తున్న ఖైదీలకు ముందుగానే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మాత్రం విజయవాడలోనే పరీక్షలు చేసినట్లు పోలీసులు సమాచారం అందించారు.