తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 43 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ షిమోషి బాజ్పేయ్ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
43 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ - east godavari latest news
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. సాధారణ ప్రజలనే కాకుండా పోలీసులనూ ఈ వైరస్ వదలడం లేదు.
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ