తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల వసతి గృహంలో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. మొత్తం రెండు వందల మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా.. 16 మందికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. బాబ్జి తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని వసతి గృహంలోని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇటీవల ఓ వైద్య విద్యార్థి దిల్లీలో శుభకార్యానికి హాజరై రావడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు.
CORONA: కాకినాడలో కరోనా కలకలం.. వసతి గృహంలోని వైద్య విద్యార్థులకు మహమ్మారి - తూర్పుగోదావరి జిల్లాలో కొత్త కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల వసతి గృహంలో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది.
16 మంది వైద్య విద్యార్థులకు కరోనా