విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజమహేద్రవరంలో తెలుగుదేశం భారీ ర్యాలీ నిర్వహించింది. కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా డీలక్స్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెదేపా నాయకులు ఆదిరెడ్డి వాసు, గన్న కృష్ణ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం అన్యాయమని చెప్పారు. ఈ అంశంపై అధికారులు పునరాలోచించాలని నాయకులు డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కుప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన - visakha steel plant latest news
విశాఖ ఉక్కుప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజమహేద్రవరంలో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.
రాజమహేద్రవరంలో విశాఖ ఉక్కుప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన