ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

suicide attempt: సుబ్రమణ్య షష్ఠి వేడుకల్లో ఘర్షణలు.. యువకుడు ఆత్మహత్యాయత్నం

Clashes In Seethanagaram: తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు, స్థానిక యువకులకు మధ్య జరిగిన ఈ ఘర్షణ.. ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.

By

Published : Dec 11, 2021, 11:43 AM IST

Clashes at Subramanya Sashti
షష్ఠి వేడుకల్లో ఘర్షణలు

సుబ్రమణ్య షష్ఠి వేడుకల్లో ఘర్షణలు

Clashes In Seethanagaram: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గళ్లలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల్లో.. పోలీసులు, కొందరు యువకుల మధ్య చెలరేగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. వేడుకల్లో మహిళలతో నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు.

కొంత మంది యువకులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఆలయంలో కుర్చీలు, పోలీసులు జీపు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ రాజేష్‌ అనే యువకుడు బ్లేడ్‌తో చేతులు, గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:TTD: తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత.. ఎఫ్​ఎమ్​ఎస్ కార్మికుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details