ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్రీస్తు జన్మదినం.. చర్చిల్లో అంబరాన్నంటిన సంబరం

క్రిస్మస్‌ వేళ రాష్ట్ర వ్యాప్తంగా  చర్చిల్లో సందడి నెలకొంది. విద్యుత్‌  దీపాల వెలుగులతో ప్రార్థనాలయాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. అర్ధరాత్రి వరకూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ వేడుకలకు ఘనంగా స్వాగతం పలికారు.

christmas-in-ap-christians-celebrated-joyful
క్రిస్మస్‌ వేళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల్లో సందడి

By

Published : Dec 25, 2019, 4:52 AM IST

క్రిస్మస్‌ సందర్భంగా చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జువెంట్ మెమోరియల్ బాస్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏంపీ మాగుంటతో పాటు క్రైస్తవులు అందరూ కొవ్తొత్తులు వెలిగించి క్రిస్మస్ వేడుకలకు స్వాగతం పలికారు.

చిన్నారుల సందడి

నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కావలి, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేటలోని పురాతన చర్చిలను సరికొత్తగా అలంకరించారు. ప్రతి చర్చి ముందు క్రిస్మస్ తాతలు, చెట్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. చిన్నారులు క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు

రాజమహేంద్రవరంలో లూథరన్ చర్చి, ఎపిఫీనియా చర్చిల్లో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా క్రైస్తవులు తరలివచ్చారు.పెద్దలు భక్తీ గీతాలు పాడుతూ, ప్రార్థనలు చేశారు. క్రీస్తు జననాన్ని తెలిపే పాటలపై చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

యేసును కీర్తిస్తూ దివ్యబలి పూజ

క్రిస్మస్ సందర్భంగా కడప జిల్లా మైదుకూరులోని ప్రార్థనా మందిరాల్లో అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా యేసుని కీర్తిస్తూ దివ్యబలి పూజ నిర్వహించారు.

ఇవీ చూడండి:

గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు చోటు

ABOUT THE AUTHOR

...view details