Chilakamarti Prabhakar: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేెశారు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, పంచాంగం, జ్యోతిష్యం తదితర అంశాలపై పుస్తకాలు రచించి... ప్రజల్లో విజ్ఞానం పంచినందుకు పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి కేంద్ర సాంస్కృతిక శాఖ పురస్కారం అందించింది. భారత సంస్కృతీ సంప్రదాయాలతో పాటు స్వచ్ఛభారత్, పర్యాటకం తదితర అంశాలపై చిలకమర్తి ఎన్నో రచనలు చేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతులమీదుగా జ్ఞాపిక అందుకున్న చిలకమర్తి - Chilakamarti Prabhakar receiving a memento
Chilakamarti Prabhakar: భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, పంచాంగం, జ్యోతిష్యం తదితర అంశాలపై పుస్తకాలు రచించి... ప్రజల్లో విజ్ఞానం పంచినందుకు పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తికి కేంద్ర సాంస్కృతిక శాఖ పురస్కారం అందించింది. ఈ పురస్కారాన్నికేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అందించారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ పురస్కారం అందుకున్న చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి
కేంద్రం నుంచి సత్కారం, పురస్కారం అందుకోవడంపై ప్రభాకర చక్రవర్తి సంతోషం వ్యక్తం చేశారు. చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తికి పురస్కారం లభించడం పట్ల ఆయనికి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సింగర్ సునీత అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్న చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తికి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై పలువురు ముఖ్యనేతల దిగ్భ్రాంతి...
TAGGED:
Chilakamarti Prabhakar