విశాఖలో ఉన్న భూములపై తప్ప ఆ జిల్లాపై వైకాపా నేతలకు ప్రేమ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విశాఖపై ప్రేమ ఉంటే అనేక సంస్థలు తెచ్చేందుకు కృషి చేసేవారని అన్నారు. రాజమహేంద్రవరంలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన... అధికార పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజధాని మార్పు కోసం రైతుల పొట్ట కొట్టాలని విశాఖ వాసులు కోరుకోరని చంద్రబాబు అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. అలాగే తనపై విమర్శలు చేసేవారికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 'నా వయసు గురించి మాట్లాడుతున్నారు మీరు. మీ 151 మందిని నేనొక్కడినే డీల్ చేయగలుగుతాను. జాగ్రత్తగా ఉండండి' అని వ్యాఖ్యానించారు. వయసుతో నిమిత్తం లేకుండా తాను ఎల్లప్పుడూ యువకుడిలా ఆలోచిస్తానని అన్నారు. తనదెప్పుడూ ఉడుకు రక్తమేనన్నారు.
'151 మంది ఎమ్మెల్యేలను నేనొక్కడినే ఎదుర్కొంటా' - చంద్రబాబు బస్సు యాత్ర
వయసుతో నిమిత్తం లేకుండా తాను ఎల్లప్పుడూ యువకుడిలా ఆలోచిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తనదెప్పుడూ ఉడుకు రక్తమేనన్నారు. అలాగే తన వయసుపై విమర్శలు చేస్తున్న వారికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
!['151 మంది ఎమ్మెల్యేలను నేనొక్కడినే ఎదుర్కొంటా' '151 మంది ఎమ్మెల్యేలను నేనొక్కడినే ఎదుర్కొంటా'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5667287-921-5667287-1578671812978.jpg)
'151 మంది ఎమ్మెల్యేలను నేనొక్కడినే ఎదుర్కొంటా'