యూపీలో ఎస్సీలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో బహుజన్ సమాజ్ పార్టీ నిరసన చేపట్టింది.
ఐఎల్టీడీ కూడలి వద్ద కొవ్వొత్తులతో పార్టీ నాయకులు ర్యాలీ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.