క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసంలో ఇరువురి మధ్య సుమారు గంటపాటు భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి అరుణ్‌కుమార్‌తో చర్చించినట్లు అనిల్ తెలిపారు. 'గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తిని కలవడం వల్ల మంచి జ్ఞానం వస్తుందని ఆయన్ను కలిశాను. ఆయన నాకు విభజన కథ అనే ఒక పుస్తకాన్ని కూడా బహూకరించారు' అని అనిల్ చెప్పారు.
చాలా ఏళ్లుగా అనిల్‌తో పరిచయం ఉందని ఉండవల్లి అన్నారు. రాజకీయం, కుటుంబ పరంగా సలహాలు సూచనలు ఇచ్చానని.. పాత పరిచయాలతో అన్ని విషయాలూ మాట్లాడుకున్నామని ఉండవల్లి చెప్పారు.