ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా పల్స్​ పోలియో.. విశాఖలో కొవిడ్ వేక్సినేషన్​కు విరామం - విజయనగరంలో పల్స్​ పోలీయో కార్యక్రమం

విశాఖ జిల్లాలో మూడు రోజులు పాటు కోవిడ్ వ్యాక్సిన్​కు విరామం ఇచ్చారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో.. పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న దృష్ట్యా.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీఎంహెచ్​వో సూర్యనారాయణ తెలిపారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో పోలీయో చుక్కల కార్యక్రమాన్ని వైద్యాధికారులు పరిశీలించారు.

break for covid vaccination in vishakapatnam in wake of polio drops programme
రాష్ట్ర వ్యాప్తంగా పల్స్​ పోలీయో కార్యక్రమం.. విశాఖలో కొవిడ్ టీకాకు విరామం

By

Published : Feb 1, 2021, 8:00 AM IST

పల్స్​ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. వైద్యాధికారులు కోరారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుతున్నారు.

విశాఖ జిల్లాలో...

ఈ ఏడాది ఒక విడత మాత్రమే పోలియో చుక్కలు పంపిణీ జరుగుతుందని విశాఖ జిల్లా డీఎంహెచ్​వో సూర్య నారాయణ తెలిపారు. మొదటి రోజు ఆరోగ్య కేంద్రాల్లో , తరవాత రెండు రోజులు నేరుగా ఇళ్లకు వెళ్లి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని చేప్పారు. ఈ సందర్భంగా విశాఖలో మూడు రోజులు పాటు కోవిడ్ వ్యాక్సిన్​కు విరామం ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అన్నారు. అమలాపురంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు.

విజయనగరం జిల్లాలో...

గర్భిణులకు, పిల్లల తల్లులకు, నవజాత శిశువులకు.. సున్నా ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి కేంద్రం సుమన్ పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు.. వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్, డాక్టర్ జి.జయశ్రీ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని సాలూరు, పాచిపెంట, మక్కున మండలాల్లో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి.. 7 పీహెచ్​సీల్లో పర్యటించి.. పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో.. సుమన్ (సురక్షిత మాతృత్వ అశ్వసన్) అమలుకు 15 పీహెచ్​సీలు గుర్తించగా అందులో 14 పీహెచ్​సీలు గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయని చెప్పారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకోనున్న ప్రాథమిక పాఠశాలలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details