గోదావరిలో బోటు వెలికితీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం ఆరు గంటల పాటు కష్టపడి పై భాగాన్ని వెలికితీసింది. నది ఒడ్డుకు 240 అడుగుల దూరంలో ఉన్న బోటును జేసీబీతో లాగేందుకు యత్నించారు. డీప్ డైవర్లు నీటి లోపలికి ఏడుసార్లు దిగి ఉచ్చు బిగించారు. రోప్ భారంగా రావడం వల్ల బోటు వస్తోందనే భావించిన బృంద సభ్యులు... టాపు మాత్రమే రావడం వల్ల నిరుత్సాహానికి గురయ్యారు. యాంకర్లు తగిలించి ఈ సాయంత్రానికల్లా పూర్తిగా వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీలు కాకుంటే రేపు కూడా వెలికితీత పనులు కొనసాగనున్నాయి.
డ్రైవర్ క్యాబిన్ బయటకొచ్చింది.. నేడో రేపో బోటు వెలికితీత! - latest news of godavari boat accident
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులు జోరందుకున్నాయి. ఈ రోజు కాకుంటే.. రేపయినా బోటును బయటికి తీసే దిశగా ధర్మాడి బృందం పని చేస్తోంది.
బోటు వెలికితీత