BJP Sunil Deodhar Tweet on Ramalayam in AP: తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరంలో రామాలయం ముంగిట్లో క్రైస్తవ ప్రార్థనలు జరిగాయంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాద మంగాయమ్మ అనే మహిళ బుధవారం రాత్రి కొంత మందితో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఆమె కుమారుడు కాద శ్రీనివాస్ తల్లితో గొడవపడుతూ.. రామాలయం ఆవరణలో ఎలా ప్రార్థన పెడతారని నిలదీసినట్లుగా ఆ వీడియోలో దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో రాముడికి అవమానమంటూ సునీల్ దేవ్‌ధర్ ట్వీట్.. అదేం లేదన్న పోలీసులు.. అసలేం జరిగింది..? - గంగవరంలో రామాలయంలో ప్రార్థనలపై భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవ్‌ధర్
BJP Sunil Deodhar Tweet on Ramalayam in AP: తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామాలయం ముంగిట క్రైస్తవ ప్రార్థనలు ఏమిటంటూ ఓ వ్యక్తి అక్కడి వారిని ప్రశ్నించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ వరకూ చేరింది. దీంతో ఆయన.. ఏపీలో రాముడికి అన్యాయం జరిగిందంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
![ఏపీలో రాముడికి అవమానమంటూ సునీల్ దేవ్‌ధర్ ట్వీట్.. అదేం లేదన్న పోలీసులు.. అసలేం జరిగింది..? Prayers in Ramalayam issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14899851-960-14899851-1648814294164.jpg)
ఈ వీడియోను చూసిన భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ గంగవరంలోని రామాలయాన్ని ఆక్రమించి.. క్రైస్తవ కూటమి నిర్వహించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మత మార్పిళ్ల అజెండాను ముందుకుతీసుకెళ్లే క్రమంలో హద్దులు దాటుతున్నారని దేవ్‌ధర్ ధ్వజమెత్తారు. ఏపీలో రాముడికి జరిగిన అవమానంపై ప్రతిఒక్కరూ గళమెత్తారని పిలుపునిచ్చారు. కాగా.. అలాంటిది ఏమీ లేదని, రామాలయం ముందు ఏసు క్రీస్తు ప్రార్థనలు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి :పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భాజపా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు