ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నినాదాలు చేస్తేనే అరెస్టు చేస్తారా?: సోము వీర్రాజు - రాజమహేంద్రవరం వార్తలు

అంతర్వేది ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. హిందుత్వాన్ని పరిరక్షిస్తారో లేదా అనే విషయాన్ని ప్రభుత్వం తేల్చి చెప్పాలన్నారు.

bjp-state-president-somu-veeraju-pressmeet
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

By

Published : Sep 9, 2020, 12:32 PM IST


రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో హిందుత్వ ఆలయాలపై జరుగుతున్న దాడులపై...హిందుత్వ సంస్థలు చేసే పోరాటానికి భాజపా నైతికంగా మద్దతు ఇస్తుందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. రాష్ట్రంలో హిందుత్వానికి సంబంధించిన అంశాలపై సర్కారు దృష్టి పెట్టాలని సూచించారు. చర్చిలపై రాళ్లు వేస్తే మాత్రం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, రథాలు కాల్చివేస్తే, విగ్రహాలు ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి పట్టదా.. అని ప్రశ్నించారు.

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం కాల్చేస్తే ప్రజాస్వామ్యంలో చూడటానికి కూడా హక్కు లేదా అని సోము ప్రశ్నించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనలో నిన్న పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని అన్నారు. అనేక మంది యువకులను, మహిళలను నినాదాలు చేస్తున్నారనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:నేడు చలో అంతర్వేదికి పిలుపునిచ్చిన భాజపా, జనసేన

ABOUT THE AUTHOR

...view details