ఆకలితో యుద్ధం చేస్తున్న యాచకులు - ఏపీలో లాక్ డౌన్ కష్టాలు
లాక్డౌన్ కారణంగా బుక్కెడు మెతుకులు దొరక్క యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇన్నాళ్లు రోజు విడిచి రోజుకైన కొంత భోజనం దొరికేది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆకలితో యుద్ధం చేస్తున్న యాచకులు
హైదరాబాద్కు చెందిన రాజేష్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 35 ఏళ్లుగా బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. లాక్డౌన్ నాటినుంచి దాతలిచ్చిన ఆహారం తింటున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక జైలు రోడ్డులో ఆహారపొట్లాన్ని తింటుండగా చుట్టూ పందులు గుమిగూడాయి. వాటిని పట్టించుకోకుండా అతను తింటున్న దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది.