బ్యాంక్ ఆఫ్ బరోడా రైతు పక్షోత్సవాలను రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో నిర్వహించారు. బ్యాంకు ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ బి ఆర్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్టోబరు 1 నుంచి 16 వరకూ జరిగే కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని పాటిల్ తెలిపారు. రైతుల కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు, పశువులకు అవసరమైన పరీక్షలు, భూసార పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంలో భాగంగా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని పాటిల్ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
రాజమహేంద్రవరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రైతు పక్షోత్సవం - bank of baroda farmers festival in rajamahendravaram
బ్యాంక్ ఆఫ్ బరోడా రైతు పక్షోత్సవాలను రాజమహేంద్రవరంలో నిర్వహించారు. పట్టణంలోని ఆనం కళా కేంద్రం వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు.. ముఖ్యఅతిథిగా బ్యాంక్ జనరల్ మేనేజర్ బి ఆర్ పాటిల్ హాజరయ్యారు.
రాజమహేంద్రవరంలో ఘనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా రైతు పక్షోత్సవాలు