ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు పెరుగిపోతున్నాయి' - Home Minister Sucharitha

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ... మహిళలపై నేరాలు పెరుగిపోతున్నాయని హోంమంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. మహిళలు, యువతులు, చిన్నారులే లక్ష్యంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ''ఉమన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్'' అనే అంశంపై జరిగిన సదస్సులో సుచరిత పాల్గొని ప్రసంగించారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు పెరుగిపోతున్నాయి

By

Published : Sep 11, 2019, 11:24 PM IST

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు పెరుగిపోతున్నాయి

మహిళలు తమపై జరుగుతున్న అకృత్యాల గురించి పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయలేకపోతున్నారని హోంమంత్రి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారిందని చెప్పారు. మహిళకు ఏ ఇబ్బంది కలిగినా... 100, 112, 182 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతికత వల్ల అభివృద్ధి చెందాలే తప్ప... ఇబ్బందులు పడకూడదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అభిప్రాయప్డారు. ఈ సదస్సు ద్వారా సైబర్ నేలాల పట్ల అవగాహన కలిగిందని విద్యార్థినులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details