కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కళాకారులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పులలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులు దుకాణాల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు.
అనవసరంగా బయటకొచ్చారో.. యముడే మీ దగ్గరకొస్తాడు - jangon latest news
లాక్డౌన్ నిబంధనలు పాటించాలని...అనవసరంగా బయటకొస్తే కరోనా బారిన పడతారని హెచ్చరిస్తూ తెలంగాణలోని సింధు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య అవగాహన కల్పించారు.
artists-educating-the-public-on-corona-in-jangon
యుముడు, యమభటుల వేషధారణలో ప్రజలకు కరోనా నుంచి రక్షణ చర్యలను వివరించారు. ఇళ్లల్లోనే ఉండాలని... అత్యవసర సమయంలో బయటకొస్తే నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రామారావు, కళాకారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :లాక్డౌన్ పాస్ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత