ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎయిమ్స్, స్విమ్స్​లో కరోనా క్లినికల్ ట్రయల్స్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ

కరోనా వైరస్ చికిత్సకు మంగళగిరి ఎయిమ్స్​తో పాటు తిరుపతిలోని స్విమ్స్​లో క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్లాస్మా థెరపీ ద్వారా క్లినికల్ ట్రయల్ చేయాలని కేంద్రం అనుమతి కోరినట్టు వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో పాటు కరోనా రోగులకు ఆక్సిజన్ అధికంగా అందించటం ద్వారా తొందరగా నయం అవుతోందని సూచనతో ఆ దిశగానూ వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Ap govt clinical trails on corona in mangalagiri aiims, Svims
ఎయిమ్స్, స్విమ్స్​లో కరోనా క్లినికల్ ట్రయల్స్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ

By

Published : Apr 24, 2020, 5:54 AM IST

మీడియాతో మాట్లాడుతున్న వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి

కరోనా చికిత్స కోసం ప్లాస్మా థెరపీని వినియోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు కేంద్రప్రభుత్వ అనుమతిని కోరింది. మంగళగిరిలోని ఎయిమ్స్ తో పాటు తిరుపతిలోని స్విమ్స్ లో ఈ తరహా ప్లాస్మా థెరపీ ద్వారా రోగులకు చికిత్స అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు కరోనా రోగులకు ఆక్సిజన్ ఎక్కువ అందించటం ద్వారా నయం అవుతోందంటూ ఐసీఎంఆర్ నుంచి సూచన రావటంతో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ప్రారంభించారు.

2 లక్షల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లోని అన్ని పడకలకూ ఆక్సిజన్ సరఫరా అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలెండర్ల ఉత్పత్తి పెంచటంతో పాటు పెద్ద మొత్తంలో మెడికల్ ఆక్సిజన్​ను నిల్వ చేస్తున్నారు. వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ సరఫరా ఉంటే రోగులకు త్వరగా నయం అవుతుందని ఓ సూచన రావడంతో ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల కలిపి 16 వేల పడకలకు ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 21 వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరా జరిగేలా సిద్ధం చేస్తున్నారు.

590 కేసులు ఆ నాలుగు జిల్లాల్లోనే

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రీన్ జోన్లను కాపాడుతూనే .. రెడ్ జోన్లలో కేసుల సంఖ్య తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి 103 మండలాల్లో 181 క్లస్టర్లు ఉన్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం 56 మండలాలు రెడ్ క్యాటగీరిలో ఉన్నాయని .. ఇలాగే 570 గ్రీన్ జోన్​లో ఉన్నాయని తెలియచేసిది. మొత్తం 590 కేసులు 4 జిల్లాల్లోనే విస్తరించి ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని.. రెడ్ జోన్లలో పాజిటివ్ వ్యక్తుల ప్రాథమిక, ద్వితీయ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో నిర్ధరణ పరీక్షల్ని గణనీయంగా పెంచినట్టు వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రతీ పది లక్షల మంది జనాభాకు 961 పరీక్షలు నిర్వహించి దేశంలోనే తొలిస్థానంలో ఏపీ ఉందని వెల్లడించింది. ర్యాపిడ్ టెస్టులు నిర్వహణకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.

నెగిటివ్... తిరిగి పాజిటివ్

తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కరోనా నుంచి కోలుకుని మళ్లీ పాజిటివ్​ వచ్చాయని, వీటిపై పరిశీలన చేస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 27 మంది మృతి చెందారని .. ప్రతీ కరోనా మరణాన్ని కూడా ఆడిట్ చేస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా కారణంగా అవుట్ పేషెంట్ విభాగం పనిచేయకపోవటంతో ఇతర రోగులు ఇబ్బందులు పడుతున్నందున టెలిమెడిసిన్ ద్వారా సేవలందిస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి : 'త్వరలోనే రోజుకు 17 వేల మందికి కరోనా పరీక్షలు'

ABOUT THE AUTHOR

...view details