ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కన్నపేగు కైలాస రథాన... కామధేను కన్నీటి పథాన - ఆవు దూడ

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు దూడకు జంతుప్రేమికులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు. ఊరేగింపుగా వాహనంలో దూడను తీసుకెళుతున్నప్పడు తల్లి ఆవు..మిగత ఆవులు వాహనం వెంట పరుగులు తీసి మాతృప్రేమను చాటుకున్నాయి.

cow
ఆవు దూడ

By

Published : Jul 18, 2021, 7:08 AM IST

Updated : Jul 18, 2021, 1:17 PM IST

చనిపోయిన దూడ వెంట తల్లి ఆవు పరుగులు

కరోనా కాలంలో మనుషుల మృతదేహాలకే అంత్యక్రియలు నిర్వహించడం కష్టతరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన ఓ ఆవు దూడకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి జంతు ప్రేమికులు ఆదర్శంగా నిలిచారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పది రోజుల క్రితం ఓ ఆవు దూడను ద్విచక్రవాహనం ఢీకొంది. దూడకు బలమైన గాయాలై రోడ్డు పక్కనే పడివుందనే విషయం జంతుప్రేమికుల దృష్టికి వచ్చింది. వెంటనే వారు స్పందించి తోట సుబ్బారావు గోశాలకు తరలించారు. చికిత్స అందించినప్పటికీ దూడ మృతిచెందింది. జంతు ప్రేమికులంతా కలిసి దూడ కళేబరానికి శాస్త్రోక్తంగా ఆఖరి స్నానం, డప్పులతో కైలాస రథంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంలో తల్లి ఆవుతో పాటు, మరికొన్ని ఆవులు వాహనం వెంట పరుగులు తీసి మాతృప్రేమను చాటుకున్నాయి. అనంతరం ధవళేశ్వరం కైలాస భూమి వద్ద దూడను పూడ్చిపెట్టారు.

ఇదీ చదవండి:సంరక్షించే వారు లేక... గోమాతల ఆర్తనాదాలు!

Last Updated : Jul 18, 2021, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details