రాజమహేంద్రవరం డీఎంహెచ్ఎస్ పాఠశాలలో అమ్మఒడి పథకం రెండో విడత ఎంపీ భరత్ చేతుల మీదుగా ప్రారంభమైంది. పేదలకు విద్యను చేరువ చేసేందుకు సీఎం ఈ పథకం ప్రవేశపెట్టారని ఎంపీ అన్నారు. కార్పొరేట్ విద్య అందరికీ అందేందుకు అమ్మఒడి నగదు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోని పిల్లలకు విద్యనందించేందుకు టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
'ప్రైవేటుకు దీటుగా విద్య అందించేందుకే.. అమ్మ ఒడి' - Ammavodi scheme second term launched news
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం డీఎంహెచ్ఎస్ పాఠశాలలో అమ్మ ఒడి రెండో విడత పథకాన్ని ఎంపీ భరత్ ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగానికి ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.
!['ప్రైవేటుకు దీటుగా విద్య అందించేందుకే.. అమ్మ ఒడి' Ammavodi scheme second term](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10200291-996-10200291-1610436098627.jpg)
అమ్మఒడి పథకం రెండో విడత ప్రారంభం