ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిర్ణయం మార్చుకోండి.. మా జిల్లా పేరు మార్చొద్దు'

konaseema District: 'కోనసీమ జిల్లా' పేరును మార్చొద్దని అమలాపురంలో కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్​ లోపలికి చొచ్చుకెళ్లారు. ఓ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పక్కనున్న వాళ్లు నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. పేరు మార్పు నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Konaseema District Sadhana Samithi
Konaseema District Sadhana Samithi

By

Published : May 20, 2022, 4:48 PM IST

konaseema District: 'కోనసీమ జిల్లా' పేరును మార్చొద్దని కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి ఆందోళనకారులు అమలాపురం నల్ల వంతెన దగ్గరకు చేరుకున్నారు. అక్కడనుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలివెళ్లారు. కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ గేటు లోపలకు వెళ్లి ధర్నా నిర్వహించారు. ఆందోళనకారుల్లో ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా చుట్టుపక్కల వాళ్ళు నియంత్రించారు. పోలీసులు కలెక్టరేట్ లోపలికి వచ్చే వారిని నియంత్రించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కోనసీమ జిల్లా పేరును అలాగే ఉంచకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details