ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేర్వేరు ప్రమాదాలు.. ఒక్కరోజే ఐదుగురు మృతి

accident
accident

By

Published : Sep 9, 2021, 7:57 AM IST

Updated : Sep 9, 2021, 9:42 AM IST

07:54 September 09

రోడ్డు ప్రమాదాలు..

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రోడ్డుపై వెళ్లేప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న నిర్లక్ష్యం పలువురి ప్రాణాలను తీస్తోంది. వాహనదారుల అజాగ్రత్త, నిబంధనల అతిక్రమణ, మితిమీరిన వేగం, రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలపడం లాంటి కారణాలతో ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతో రోజుకు కనీసం 10 మందికి పైగా మరణిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు.

తూర్పుగోదావరి జిల్లా.. 

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తి పూడి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్​లో తుని ఆసుపత్రికి తరలించారు. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు.. కత్తిపూడి బిడ్జ్ మీద అగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురులో ఒక మహిళ, ఒక బాలుడు మృతి చెందారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకాశం జిల్లా...

ఒంగోలు మండలం త్రోవగుంట వద్ద ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టి ఇద్దరు మృతి చెందారు. మృతులు ఒంగోలు గోపాలనగర్ వాసులుగా పొలీసులు గుర్తించారు. కేసునమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

అనంతపురం జిల్లా... 

అనంతపురం జిల్లా నగర శివారు శిల్పారామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరుకు చెందిన వైద్యుడు రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నగరంలోని రెండో రోడ్డులో నివాసముంటున్న రాజేష్ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. కర్నూలు నుంచి అనంతపురం వస్తున్న సమయంలో కారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను బలంగా ఢీ కొట్టడంతో దాదాపు 50 అడుగుల దూరంలో కారు ఎగిసిపడింది. కారులో ఒక్కడే ఉన్న రాజేష్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

జాగ్రత్తలు తప్పనిసరి...

ప్రయాణం సాఫీగా సాగించాలంటే, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలంటే రహదారుల భద్రతో ఎంతో ముఖ్యం. ప్రధానంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో రోడ్‌సేఫ్టీ విభాగం ఏర్పాటు చేశారు. హైవేలపై వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే రోడ్‌ సేఫ్టీ విభాగం కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమైందన్న ఆరోపణలున్నాయి.

ఇదీ చదవండి: current bill: విద్యుత్తు ఛార్జీల మోత.. అన్ని కేటగిరీల్లోనూ..

Last Updated : Sep 9, 2021, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details