తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెద్దపళ్లకు చెందిన నలుగురు వ్యక్తులు ఇటీవల దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వీరికి కరోనా లక్షణాలు ఉండటంతో రాజమహేంద్రవరం క్వారంటైన్‌కు తరలించారు. అలాగే... ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడి కుమారుడితోపాటు కోడలు, మనవడు, మనవరాలు కొత్తపేటలో నివసిస్తున్నారు. వారికి దగ్గు, జలుబు ఉన్నట్లు గుర్తించిన వైద్య సిబ్బంది వెంటనే వారిని 108లో రాజమహేంద్రవరం క్వారంటైన్ తరలించారు.
కరోనా అనుమానితులు క్వారంటైన్‌కు తరలింపు - కరోనా కేసులు న్యూస్
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎనిమిది మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారిని రాజమహేంద్రవరం క్వారెంటైన్‌కు తరలించారు. అందులో నలుగురు దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు.
![కరోనా అనుమానితులు క్వారంటైన్‌కు తరలింపు కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6604273-381-6604273-1585629881949.jpg)
కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలింపు
కరోనా అనుమానితులు క్వారంటైన్‌కు తరలింపు
Last Updated : Mar 31, 2020, 2:14 PM IST