ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

5pm_Topnews
ప్రధాన వార్తలు @ 5pm

By

Published : Mar 6, 2021, 5:01 PM IST

  • డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్​- చివరి టెస్టులో ఇంగ్లాండ్​ చిత్తు
    ఇంగ్లాండ్​తో చివరి టెస్టులో భారత్​ ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్​ 25 పరుగుల తేడాతో పర్యటక జట్టును చిత్తుగా ఓడించి.. సిరీస్​ను 3-1తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీ సేన. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • టీ కప్పులో తుపాను...వివాదం సమసిపోయిందంటున్న తెదేపా నేతలు
    విజయవాడ తెదేపా నేతల వివాదంపై అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు బొండా, బుద్దా, నాగుల్‌మీరాతో అచ్చెన్నాయుడు, టి.డి.జనార్దన్‌, వర్ల రామయ్య చర్చలు జరిపారు. కేశినేని శ్వేత విజయానికి తామంతా కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తితిదేను.. జగన్ దేవస్థానంగా మార్చేశారు: భానుప్రకాశ్ రెడ్డి
    సీఎం జగన్​పై భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. తితిదే దర్మకర్తల మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చంద్రబాబు విశాఖలో అబద్ధాలు మాట్లాడారు: అవంతి
    మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి... వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రభుత్వం చేసిన అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ
    వైకాపా ప్రభుత్వం 20 నెలల్లోనే లక్షా 55 వేల కోట్లు అప్పు చేసిందని.., తెచ్చిన అప్పుతో ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే..ప్రజలకు భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ ఓటేయాల్సిన అవసరం ఉండదన్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'దిల్లీలో ఇకపై సొంత పాఠశాల విద్యాబోర్డు'
    దిల్లీకి ఇప్పటినుంచి సొంత పాఠశాల విద్యాబోర్డు ఉండనుందని ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ తెలిపారు​. 2021-22 విద్యాసంవత్సరంలో దిల్లీ పాఠశాల విద్యాబోర్డు కింద 20 నుంచి 25 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. బట్టీపట్టే విధానం కాకుండా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే దిశగా ముందుకెళ్తామన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మార్చి 15 నుంచి సుప్రీంలో భౌతిక విచారణ
    భౌతికంగా విచారణ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈనెల 15 నుంచి విచారణను భౌతికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సుప్రీం.. మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్​ ప్రభుత్వం
    పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. మొత్తం 342 స్థానాలున్న ఆ దేశ జాతీయ అసెంబ్లీలో 178 ఓట్లు సాధించి బలపరీక్షలో గెలుపొందారు. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 172 ఓట్లు అవసరం. ఈ విశ్వాస తీర్మానాన్ని విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ ప్రతిపాదించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వారంలో భారీగా కరిగిన ఎలాన్ మస్క్‌ సంపద!
    నాలుగు రోజుల్లో దాదాపు రూ.2లక్షల కోట్లను కోల్పోయారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా రికార్డు సృష్టించిన మస్క్.. మార్కెట్​లో టెస్లా షేర్ల పతనంతో భారీ సంపద కోల్పోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రభాస్-నాగ్ అశ్విన్​ సినిమా సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే
    ప్రభాస్​తో తీయబోయే సినిమా షూటింగ్​ను జులైలో ప్రారంభిస్తానని చెప్పారు దర్శకుడు నాగ్​ అశ్విన్​. అయితే ఈ చిత్రీకరణ ఎప్పటికీ పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేనని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details