ఒంగోలులో నగరవాసుల ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో అభివృద్ధిని చూసి మరోసారి ప్రజలు తెదేపాకి ఓటు వేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ కోరారు. నగరంలోని రంగాభవన్ లో నవ్యాంధ్ర అభివృద్ధి కాంక్షించే నగరవాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అధికారంలో రాక మునుపే వైకాపా అధినేత జగన్ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి..అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరారు.
ఇవి చూడండి...