Zoology Museum: మారుతున్న విద్యావిధానంలో ప్రయోగాత్మక బోధనకు పెద్దపీట వేస్తున్నారు. సైన్స్ విద్యార్థులకు ఈ తరహా బోధన ఎంతో అవసరం. కానీ ఒకప్పుడు కళాశాల్లో అసలు ప్రయోగశాలలు ఉండేవి కావు. మ్యూజియంల ఊసే లేదు. ఇప్పటికీ చాలా కళాశాలల్లో సరైన ల్యాబ్‌లు అందుబాటులో లేవంటే అతిశయోక్తి కాదు. అటువంటిది.. నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో.. ఉన్న జువాలజీ మ్యూజియం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ మ్యూజియం విశేషాలు మనమూ చూసేద్దాం.
1964లో నెల్లూరులో దొడ్ల కౌసల్యమ్మ డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. అదే సమయంలో కళాశాలలో అద్భుతమైన ల్యాబ్స్, జువాలజీ విభాగానికి సంబంధించి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. మ్యూజియంలో అరుదైన జీవ జాతులకు సంబంధించి స్పెసిమెన్స్, ట్యాక్సీడెర్మీసెక్షన్ కూడా ఉంది. వందల సంఖ్యలో సేకరించి భద్రపరిచిన జీవజాతులను చూసేందుకు జిల్లాలోని విద్యార్థులే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ కళాశాలలో జీవ, జంతు, రసాయన శాస్త్రాలకు సంబంధించి ప్రయోగశాలలను.. అధునాతన సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు.