నెల్లూరు జిల్లా అధికారుల తీరుపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేయాలని ఇద్దరు ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. తనపై కేసు నమోదు చేసిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న ఆయన... పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తే కేసు నమోదు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూముల్లో కూర్చుని వందల మందితో సమీక్షలు ఎలా చేస్తున్నారని అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ ఘటనపై మంత్రులు అనిల్, మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించాలన్నారు. పంపిణీలో తనతో ఉన్న ఒక్క అధికారిని సస్పెండ్ చేసినా ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ అన్నారు.
అధికారులకు అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్..! - వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ అరెస్టు కామెంట్స్
నిత్యావసరాలు పంపిణీ చేసినందుకు తనపై కేసు నమోదు చేస్తారా అని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేయాలని అధికారులకు సవాల్ చేశారు. ఈ ఘటనపై మంత్రులు అనిల్, మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించాలన్నారు.
అధికారులకు వైకాపా ఎమ్మెల్యే సవాల్..!