నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి పొడవునా ఉన్న భూములు అధిక ధరలు పలుకుతుండడంతో వాటిపై భూబకాసురుల కళ్లు పడుతున్నాయి. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారుల అండదండలతో స్థానిక వైకాపా నేతలు భూ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో 209 ఎకరాల దేవుడి మాన్యం భూమిని 15 ఏళ్ల కిందట కృష్ణపట్నం పోర్టుకు అప్పగించారు. ఐతే ఈ భూమినే 11 మంది ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేసినట్లు ఆరోపించారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌కు తహసీల్దార్ ఎన్‌ఓసీ కూడా ఇచ్చారని ఆరోపించారు. ఇదే విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారించి తహసీల్దార్‌తో పాటు సూపరింటెండెంట్, కంప్యూటర్ ఆపరేటర్‌ను సస్పెండ్ చేశారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు కోరుతున్నారు.
జిల్లాలో భూ దోపిడీ.. ?... వైకాపా నేతలే దోచుకుంటున్నారని ఆరోపణ - nellore district crime
నెల్లూరు జిల్లాలో కొందరు వైకాపా నేతలు ప్రభుత్వ భూముల్ని దోచుకుంటున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. భూ దోపిడీకి కొంతమంది రెవెన్యూ అధికారులే సహకరించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భూ కుంభకోణాల వెనుకున్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వెంకటాచలం మండలంలో తహసీల్దార్ లాగిన్ హ్యాక్ చేసి కాకుటూరులోని 14.14 ఏకరాలు, చెముడుగుంటలో 1.60 ఎకరాల ప్రభుత్వ భూముల్ని పట్టా భూములుగా రికార్డుల్లో మార్చినట్లు ఆరోపించారు. మరోచోట ప్రభుత్వ కాలువ పోరంబోకు స్థలం 1.88 ఎకరాలు ఓ మహిళ పేరుతో రికార్డుల్లోకి ఎక్కించడం, పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు కూడా సిఫారసు చేశారని ఆరోపించారు. మొత్తం 60 కోట్ల విలువైన భూకుంభకోణం జరిగిందని తెలుగుదేశం నేత అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఇదే విషయంపై కలెక్టర్ నలుగురు రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. కావలిలో వైకాపా నేతలు ఎర్రమట్టి, ఇసుకను దోచుకుంటున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదీచదవండి.