ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YCP Leader Suicide Attempt : పొలం కోసం వైకాపా నాయకుడి ఆత్మహత్యాయత్నం - నెల్లూరు జిల్లాలో వైకాపా నాయకుడు ఆత్మహత్యాయత్నం

YCP Leader Suicide Attempt : తన పొలాన్ని ప్రభుత్వం నుంచి కాపాడుకోవడానికి వైకాపా నాయకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

YCP Leader Suicide Attempt
పొలం కోసం వైకాపా నాయకుడి ఆత్మహత్యాయత్నం

By

Published : Dec 21, 2021, 4:32 PM IST

Updated : Dec 21, 2021, 8:58 PM IST

YCP Leader Suicide Attempt : నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం గ్రామంలో వైకాపా మండల నేత సురా శ్రీనివాసులు రెడ్డి గతంలో ప్రభుత్వానికి ఎకరా భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాడు. అయితే అప్పట్లో అధికారులు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎకరా భూమికి రావలసిన 15 లక్షల రూపాయల నగదు చెల్లించక పోగా.. తన సాగులో ఉన్న కొంత భూమిలో ప్రభుత్వ భూమిని ఉందని.. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.అధికారులు తీరుపై మనస్తాపానికి గురైన శ్రీనివాసులు రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతని వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. పురుగుల మందు డబ్బాను లాగే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో శ్రీనివాసులు రెడ్డి స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఆయన్ను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.

పొలం కోసం వైకాపా నాయకుడి ఆత్మహత్యాయత్నం
Last Updated : Dec 21, 2021, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details