ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంతలో ఇరుక్కున్న కార్మికుడు.. రక్షించిన రైల్వే సిబ్బంది - nellore accident news

ఓ ప్రేవేటు కార్మికుడు పనులు చేస్తూ.. గుంతలో ఇరుక్కుపోయాడు. సమీపంలోని రైల్వే సిబ్బంది గుర్తించి. కార్మికుణ్ని సురక్షితంగా బయటకు తీశారు.

గుంతలో ఇరుక్కున్న కార్మికుడు.. రక్షించిన రైల్వే సిబ్బంది
గుంతలో ఇరుక్కున్న కార్మికుడు.. రక్షించిన రైల్వే సిబ్బంది

By

Published : Aug 20, 2020, 11:37 PM IST

నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో పనులు చేస్తున్న ఓ ప్రైవేటు కార్మికుడు గుంతలో ఇరుక్కుపోయాడు. రైలు మార్గాల మధ్య పైప్​లైన్ వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మట్టి.. పైన పడడం వల్ల ఊపిరాడక కార్మికుడు లోపలే ఉండిపోయాడు.

సమయానికి అక్కడ ఉన్న రైల్వే ఉద్యోగులు వెంటనే సహాయకచర్యలు ప్రారంభించారు. కార్మికుడి తల వెంట్రుకలను గుర్తించి అరగంట సేపు చాకచక్యంగా కష్టపడి అతడిని బైటకు తీశారు. ఎలాంటి గాయాలు లేకుండా కార్మికుడు సురక్షితంగా బయటపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details