నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులుతీరారు. అమ్మకాలు ప్రారంభం కాకముందే జిల్లాలో పలు చోట్ల వందల సంఖ్యలో దుకాణాల వద్ద ఎగబడ్డారు. స్థానిక పోలీసులు, వార్డు సచివాలయ సిబ్బంది మద్యం కోసం వచ్చిన వారిని క్యూలైన్లలో పంపేందుకు చర్యలు చేపట్టారు.
నెల్లూరులో మద్యం దుకాణాల వద్ద క్యూ.. - నెల్లూరులో మద్యం దుకాణాలు
రాష్ట్రంలో మద్యం ధరలు 25శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పలు జిల్లాల్లోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరచుతున్నాయి. మందు బాబులు సామాజిక దూరం పాటించకుండా మందు షాపుల వద్ద క్యూకట్టారు.
wine shops open