నెల్లూరు నగరంలో ప్రజల గొంతెండుతోంది. గుక్కెడు నీరు కోసం నానాకష్టాలు పడుతున్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంకులోనూ నీటిమట్టం అడుగంటి... మురుగునీరుగా మారింది. కొళాయిల ద్వారా సక్రమంగా నీరు రావడం లేదు. కార్పోరేషన్ ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి ట్యాంకర్లు చాలడంలేదని నగర వాసులు వాపోతున్నారు. చాలీచాలని నీటితో కాలం వెళ్లదీస్తున్నామని చెబుతున్నారు.
నెల్లూరు నగరంలో... దాహం దాహం - nellore city
నెల్లూరు నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. సోమశిలలో నీరు అడుగంటడంతో చెప్పలేని తిప్పలు పడుతున్నారు. పెన్నానదిలోనూ భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నీటి సమస్యపై ''ఈటీవీ భారత్'' ప్రత్యేక కథనం.
నెల్లూరు నగరంలో దాహం దాహం