ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అప్రజా స్వామికమని విశాఖ తెదేపా పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. మాజీ సీఎం రాజశేజర్రెడ్డి మానస పుత్రికగా చెప్పే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేయడం సరికాదని జిల్లా తెదేపా కార్యాలయంలో తెలిపారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఆ పథకాన్ని అమలుచేయాలని చేయాలని కోరారు.
'ప్రైవేటు కళశాలలు దోపీడీకి పాల్పడుతున్నాయి'
పరీక్ష ఫీజుల పేరుతో ప్రైవేటు కళాశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆరోపించింది. యూనివర్సిటీ నిర్ధేశించిన ఫీజుల కన్నా అదనంగా వసూలు చేస్తున్నారని నెల్లూరులో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్ తెలిపారు. విద్యార్థులను వేధించి అదనపు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోకుంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:వైకాపా ప్రభుత్వం బీసీలకు మొండిచేయి చూపిస్తోంది..