ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పూర్తితో ఆయన మనవరాలు నిహారిక 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తన వివాహం సందర్భంగా హృదయ క్యూర్ ఏ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌కు విరాళాన్ని ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్రమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో చెక్కును ట్రస్టుకు అందించారు. నిహారికను వెంకయ్యనాయుడు అభినందించారు.
ఉపరాష్ట్రపతి మనుమరాలి దాతృత్యం.. రూ.50 లక్షలు విరాళం - దాతృత్వాన్ని చాటుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు. హృదయ క్యూర్ ఏ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌కు రూ.50 లక్షలు విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.
స్వర్ణభారత్ ట్రస్ట్‌కు విరాళం అందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుమనవరాలు