25న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలు - undefined
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విక్రమ సింహపురి స్నాతకోత్సవాలకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వ హరిచంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రెండు, మూడు, నాలుగు, ఐదో స్నాతకోత్సవాలు ఘనంగా జరుపుతున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్(వీసీ) ప్రొఫెసర్ సుదర్శన్ రావు తెలిపారు. ఈనెల 25వ తేదీన నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఈ వేడుకలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని 733 మంది విద్యార్థులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వీరిలో 60 మందికి విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామన్నారు.