Venkaiah Naidu: అందరూ కలిసి జీవించడం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం ఎంతో గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో ప్రతిభ పురస్కారాల అవార్డు ప్రదానోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అవినీతిపై పోరాటం చేయాలని వెంకయ్య నాయుడు తెలిపారు. సంపాదనలో కొంత భాగం సమాజానికి ఖర్చు చేసినప్పుడే.. మనసు తృప్తిగా ఉంటుందన్నారు. పదో తరగతిలో 500 పైచిలుకు మార్కులు సాధించిన విద్యార్థులకు వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నగదు ప్రోత్సాహకాలు అందించారు.
సంపాదనలో కొంత సమాజానికి ఖర్ఛు చేయాలి : వెంకయ్యనాయుడు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: అవినీతిపై పోరాటం చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విలువలతో జీవించాలని.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందించారు.

వెంకయ్యనాయుడు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
"సంపాదనలో కొంతభాగం సమాజానికి ఖర్చు చేయండి. అందరికోసం అందరితో కలిసి జీవించండి. స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. అవినీతిపై పోరాటం చేద్దాం. విలువలతో జీవిద్దాం.. సంస్కృతి, సంప్రదాయాలు కాపాడదాం."-మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఇవీ చదవండి: