- cm jagan: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సీఎం జగన్ నివాళి
మాజీ రాష్ట్రపతి, భారత రత్న.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్.. ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- PROTEST: ప్రైవేటు పాఠశాలలను కాపాడాలంటూ నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాల గురించి ఆలోచించాలని ఫెడరేషన్ ఆఫ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. జీవో నెం: 53 తమకు శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీరు విడుదల
ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) నుంచి నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 69 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తుండగా..కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.7 లక్షల విలువగల 77 కిలోల గంజాయి పట్టివేత
ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద రూ.7 లక్షల విలువగల 77 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నా వాళ్లే లైంగికంగా వేధిస్తున్నారు'.. 10ఏళ్ల బాలిక ఫిర్యాదు!
సొంత కుటుంబ సభ్యులే తనపై లైంగిక వేధింపులకు(sexual exploitation) పాల్పడుతున్నారని ఓ 10 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ అశోక్‌నగర్ జిల్లాలో జరిగింది. ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ హైకోర్టుకు జడ్జి నియామకంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఇటీవలే భారీ స్థాయిలో హైకోర్టు జడ్జీల నియామకం(judges appointment news) చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆ ప్రక్రియ అంతా సీనియారిటీ, అర్హతను దృష్టిలో పెట్టుకునే సాగినట్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెచ్చిపోయిన తాలిబన్లు- ఆత్మాహుతి దాడిలో జవాన్లు బలి
ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు ఒడిగట్టారు. తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ ముఠాకు చెందిన ఉగ్రవాది(suicide bomber).. భద్రతా బలగాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి(suicide attack in pakistan) పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త ఆఫీస్ కొన్న 'సీరం బాస్'- విలువ తెలిస్తే షాకే!
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్పూనా వాలా(Adar Poonawalla).. అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన వార్త ఉంటే.. ఈయన ప్రస్తావన ఉండాల్సిందే.. అయితే ఈయన వ్యాక్సిన్ ఉత్పత్తి మాత్రమే కాకుండా.. ఫినాన్స్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ind vs Eng: టీమ్ఇండియాలో కరోనా.. రవిశాస్త్రికి పాజిటివ్
టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి(ravi shastri corona positive) కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడం వల్ల ముందు జాగ్రత్తగా మిగతా ముగ్గురు కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Roja Jabardasth Etv: 'పిల్లలే పుట్టరన్నారు.. అందుకే తనంటే చాలా ఇష్టం'
చలాకీగా ఉంటూ ఎప్పుడూ తన నవ్వుతో మైమరపించే రోజా.. అభిమానుల్ని కంటతడి పెట్టించారు. గతంలో తాను ఎదుర్కొన్న కష్టాలు చెబుతూ భావోద్వేగం చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @5PM