నెల్లూరు జిల్లా మర్రి పాడు చుంచులూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, ఓ క్లీనర్ మృతి చెందారు. ప్రమాదంలో వారు లారీల క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. జేసీబీ సహాయంతో స్థానికులు, పోలీసులు వారిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేపట్టారు.
Three dead in accident: రెండు లారీలు ఢీ... ముగ్గురు మృతి - నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, ఓ క్లీనర్ ప్రాణాలు కోల్పోయారు.

రెండు లారీలు ఢీ, డ్రైవర్లు మృతి