కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే.. ఆమె ఉరేసుకుంటుంటే కళ్లప్పగించి చూశాడు. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. ప్రాణాలు తీసుకుంటుంటే కాపాడతారు. ఉరేసుకుంటుంటే పగవాడైనా కాపాడేందుకు యత్నిస్తాడు. కానీ ఆ రాక్షసుడు ఆమెను ఆపకపోగా... ఏదో ఘనకార్యం చేసినట్లు ఆ ఘటనను వీడియోలో బంధించాడు. అంతేకాకుండా ఆ వీడియోను బంధువులందరికీ పంపి పైశాచిక ఆనందం పొందాడు.
LIVE SUICIDE: కళ్లెదుటే భార్య ఉరి..ఆపకుండా వీడియో తీసిన భర్త
16:40 September 22
భార్య ఆత్మహత్య వీడియోను ఆమె బంధువులకు పంపిన పెంచలయ్య
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భార్య చనిపోతుంటే చూసి ఓ భర్త పైశాచిక ఆనందం పొందాడు. కళ్ల ముందే భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపాల్సిందిపోయి సెల్ఫోన్లో వీడియో తీశాడు. అది చాలదన్నట్లు ఆమె బంధువులకు ఆ వీడియోను పంపించాడు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భార్య ఆత్మహత్యను వీడియో తీసిన పెంచలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తోంది. భార్య చనిపోయేందుకు ప్రేరేపించిన పైశాచిక భర్త పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బంది కోరుతుంది.
ఇదీ చూడండి:ENGINEERING STUDENT SUICIDE: ఎగ్ దోశకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య