నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్.. చాక్, కర్రతో దాడి చేశాడు. కరోనా నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు ఆగ్రహించిన మేనేజర్... ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేనేజర్ అరెస్టు.. సస్పెండ్
ఉద్యోగిని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి తెగబడ్డ మేనేజర్ భాస్కర్‌ను అరెస్టు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ మేనేజర్ భాస్కర్‌ను సస్పెండ్ చేశారు.