ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటితో ముగియనున్న ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార గడువు - అత్మకూరు ఉప ఎన్నిక ప్రచారం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార గడువు నేటి సాయంత్రానికి ముగియనుంది. ఉప ఎన్నికను ప్రశాంత వాతారణంలో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆత్మకూరులో కేంద్రాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

Atmakur by-election
ఆత్మకూరు ఉప ఎన్నిక

By

Published : Jun 21, 2022, 9:51 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార గడువు ఈ సాయంత్రానికి ముగియనుంది. ఉప ఎన్నిక ఏర్పాట్లను సోమవారం.. రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా పరిశీలించారు. పోలింగ్‌ సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ముఖ్యంగా.. దొంగ ఓట్లకు వీలు లేకుండా ఓటర్ల జాబితాను ప్రదర్శించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌, కౌంటింగ్‌ హాలుపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని వెల్లడించారు. 127 సమస్యాత్మక ప్రాంతాల్లో.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తామన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details