TEN ANDHRA NAVAL UNIT NCC: ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వంగా ఉండటం చాలా ముఖ్యం. చిన్ననాటి నుంచే ప్రధానంగా విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ అలవడాలంటే తప్పకుండా ఎన్సీసీలో చేరాల్సిందేనంటారు. క్రమశిక్షణతో కూడిన జీవితం, ఇతరులకు సాయం చేసే గుణం అలవరుచుకోవడమేగాక.. ఎన్సీసీ సర్టిఫికెట్‌తో విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో టెన్ ఆంధ్రా నావల్ యూనిట్ అంటే ఎంతో ప్రత్యేకం. ఇక్కడ శిక్షణ పొందేందుకు విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఈ యూనిట్లో ఈ ఏడాది 2వేల 500 మంది శిక్షణ పొందుతున్నారు.
Nellore NCC Training Unit : ఎన్సీసీలో నావల్ యూనిట్ అతి ప్రధానమైనది. అనేక రకాల శిక్షణ ఇవ్వడంతోపాటు... యువతీ, యువకులను మరింత ధైర్యవంతులుగా ఇక్కడ తీర్చిదిద్దుతారు. కఠినమైన శిక్షణలో విద్యార్థులు రాటుదేలుతారు. అందుకే విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో పేరుగాంచిన టెన్ ఆంధ్రా నావల్ నెల్లూరు యూనిట్ అంటే అమితాసక్తి చూపుతారు. గతేడాది 12వందల మంది శిక్షణ తీసుకోగా... ఈసారి రెట్టింపు కన్నా ఎక్కువగా 2500మంది శిక్షణ తీసుకుంటున్నారు. జాతీయస్థాయిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సరిహద్దులోనూ సైనికులకు అవసరమైన పరిస్థితుల్లో సాయం చేస్తున్నారు. ఇటీవల కేరళలో జరిగిన బోట్ పులింగ్ రెగెట్టా పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు.
ఇదీ చదవండి :ఓ వైపు చదువు, మరోవైపు.. పవర్ లిఫ్టింగ్.. రాణిస్తున్న మంగళగిరి యువతి..
విద్యార్థులు రెండేళ్లపాటు శిక్షణలో రైఫిల్, స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటి పతకాలు సాధించారు. కొవిడ్ కాలంలో చేసిన సేవకు వీరు అనేక అవార్డులు పొందారు.ఎన్సీసీ శిక్షణలో విద్యార్థులు ఎంతో పరిణితి సాధిస్తున్నారని.... మానసికంగానూ ధృడంగా మారుతున్నారని శిక్షకులు చెబుతున్నారు.