నెల్లూరు జిల్లా బుచ్చి మండలం దామరమడుగు, శ్రీరంగరాజపురంలోని ఇసుక రీచ్ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత పోస్టుకార్డు ఉద్యమం చేపట్టింది. ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు పెద్ద పోస్టాఫీస్ నుంచి ముఖ్యమంత్రి జగన్కు వెయ్యి కార్డులను తెలుగు యువత నేతలు పోస్ట్ చేశారు.
గతంలో ఇసుక అక్రమాలపై ఆందోళన చేపడితే సిబ్బందిని తొలగించిన అధికారులు, కాంట్రాక్టర్ను మాత్రం వదిలేయడం ఎంత వరకు సమంజసమని తెలుగు యువత నేత తిరుమల నాయుడు ప్రశ్నించారు. అవినీతి అక్రమాలను ఉపేక్షించవద్దని పదే పదే చెప్పే ముఖ్యమంత్రికి సమస్యను తెలియజేసేలా పోస్టుకార్డులు పంపుతున్నామన్నారు. సీఎం కూడా స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.